'ఆపరేషన్ కగార్' పేరుతో ఆదివాసీలపై దమనకాండ: ఆచార్య జి.హరగోపాల్ 1 y ago
AP: ప్రముఖ సామాజికవేత్త ఆచార్య జి.హరగోపాల్ ‘ఆపరేషన్ కగార్’ పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న దమనకాండపై చర్చ జరగాలని అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలో అభివృద్ధి పేరుతో సమానత్వం లేకుండా కొన్ని వర్గాల చేతిలో సంపద కేంద్రీకృతమవుతున్నాయని చెప్పారు. ఖనిజ సంపదపై కార్పొరేట్ కంపెనీల ముట్టడికి వ్యతిరేకంగా మావోయిస్టుల పోరాటం ఉందని మానవహక్కుల వేదిక నేత వి.ఎస్. కృష్ణ అన్నారు